వీరశిల/వీరగల్లు మరియు సతిశిల( Hero stone and Sati stone)

వీరశిల/వీరగల్లు మరియు సతిశిల( Hero stone and Sati stone)

నేను శివరాత్రికి నల్లమల లో ఉన్న బౌరాపూర్ శివాలయాన్ని దర్శించుకొని తిరుగు ప్రయాణంలో నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మారడుగు గ్రామ సమీపంలో లో ఉన్న మార్కండేయ స్వామి గుడిని సందర్శించడం జరిగింది. ఈ గుడి ముందు ఉన్న ఒక శిల్పం నన్ను బాగా ఆకర్షించింది. అది ఒక వీరగల్లు మరియు సతిశిల. రెండు ఒకే రాతి ఫలకం పై చెక్కబడి ఉన్నవి.

hs1

HERO AND SATI STONE IN MARADUGU VILLAGE

యుద్ధ వీరులు మరణించినప్పుడు వారి పేరు మీద వేయించి రాతి చిహ్నమే వీరగల్లు. గ్రామ రక్షణ కోసం గాని, క్రూర మృగాల బారినుండి ప్రజలను కాపాడే ప్రయత్నంలో గాని, పశువుల మందను కాపాడుకోవడం కోసం గాని, యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందినప్పుడు వీరి జ్ఞాపకంగా సంబంధిత రాజులు, గ్రామ మోతుబరులు, పెద్దలు “వీరగల్లులు“(Hero Stone) వేయించేవారు. కొన్ని సందర్భాల్లో తన భర్త వీరమరణం పొందిన తర్వాత భార్య కూడా సహగమనానికి సిద్ధం అయ్యేది. ఇలా సహగమనం అయిన తర్వాత వారికి గుర్తుగా పెట్టే రాతి శిల్పాలను “సతిశిలలు“(Sati Stone) అంటారు. 


తర్వాత కాలంలో ఈ శిలలను గ్రామ దేవతలుగా, పేరంటాళ్లుగా, పోతురాజులుగా, తమను కాపాడే శక్తులుగా పూజిస్తూ ఏడాదికి ఒకసారి జాతరలు చేయటం, బలులు ఇవ్వడం జరుగుతూ ఉంది జరుగుతుంది.
అయితే వీరశైవ మతం ఉచ్చదశలో ఉన్న కాలంలో వీరశైవులు శివసాయిజ్యం కోసం ఆత్మాహుతి చేసుకున్నప్పుడు వేసిన శిలలు కూడా ఈ వీరగల్లు లలో కలిసి ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో వీరశైవాన్ని ఎక్కువగా ఆదరించిన వారు కొండవీటి రెడ్డి రాజులు. శివుని భయంకర రూపాలైన భైరవ, మైలార, వీరముష్టి, జంగమ మఠాలు ప్రతిష్టించి పూజించేవారు. తాంత్రిక విధానంలో దేవతలకు ‘పంచమ’కారాలనే నైవేద్యం సమర్పించేవారు. మద్యం, మీనం, మాంసం, ముద్ర, మైధునం వీటిని పంచమకారాలు అంటారు.మైలారభటులు,వీరముష్టి వారు, వీర జంగములు పాశుపత ఆరాధనలో అనేక సాహసకృత్యాలు చేసేవారు. రాజు కోసం రాజ్యం కోసం వారు తలలు నరుక్కునేవారు, పొట్టలో కత్తులు జొప్పించుకునేవారు. స్త్రీ పురుషులు ఆత్మహత్యలు చేసుకునే గుడులు ఉండేవి. వీటినే ‘చంపడు గుడులు‘ అనేవారు. వీటి గురించి ప్రస్తావన కొరవి గోపరాజు రాసిన “సింహాసన ద్వాత్రింశిక” అనే గ్రంథంలో ఉంది. కొండవీటి రెడ్డి రాజు అనవేమారెడ్డి శ్రీశైలం లో నిర్మించిన ‘వీరశిరోమండపం‘ కూడా ఇలాంటిదే. దీనిలో భక్తులు తమ కోరికలు తీరిన తర్వాత తమ శరీర భాగాలను, తలను గండ కత్తెర వేసుకొని దేవుడికి అర్పించే వారు.

hs

HERO STONE IN HAMPI


పాల్కురికి సోమనాథుడు రాసిన “పండితారాధ్య చరిత్ర” ను బట్టి శ్రీశైలంలో ‘భృగుపాతం‘ ఆచారం కూడా ఉంది. అంటే భక్తులు శివైక్యం పొందటానికి కొండచరియలు పైనుండి దూకి ఆత్మాహుతి చేసుకోవడం. ప్రస్తుతం శ్రీశైలంలోని ‘సిద్ధ రామప్ప కొలను‘ ప్రాంతంలో పూర్వం భృగుపాతం జరిగేది.


కాకతీయుల కాలంలో యుద్ధంలో ఓడిన శత్రువుల తలలతో బంతులు ఆటలు ఆడటం (శిరఃకందుక క్రీడావినోదం) చేసేవారు. కాకతీయ గణపతి దేవుని సేనలు వెలనాటి రాజైన పృధ్వీశ్వరుడిని పై దండెత్తి అతన్ని యుద్ధంలో ఓడించి చంపాయి. కొన్ని కాకతీయ శాసనాలలో గణపతిదేవునికి “పృథ్వీశ్వర శిరఃఖండుక క్రీడావినోద” అనే బిరుదు ఉంది.
రేచర్ల వెలమ రాజుల కాలంలో ‘రణముకుడుపు‘ అనే భైరవ తాంత్రిక విధానం ఉండేది. యుద్ధంలో చనిపోయిన శత్రువుల యొక్క రక్తమాంసాలతో ఉడికించిన అన్నం కావలి దేవతలకు ఊరి చుట్టూ పొలిజల్లడం చేసేవారు. ఇటువంటి సంస్కృతి మనకు వీరగల్లు లలొ, మధ్యయుగ సాహిత్యంలో కనిపిస్తుంది.

                                                                                     —-నల్లగొర్ల వేదాద్రి.

LODDI MALLAIAH / GUPTAMALLIKHARJUNAM,NALLAMALA,NAGAR KURNOOL DISTRICT,TELANGANA

నల్లమల్ల కీకారణ్యంలో కోట్ల సంవత్సరాల క్రితం వెలసిన “లొద్ది మల్లయ్య స్వామి” వారి కధనం :
తొలి ఏకాదశి కి మాత్రమే భక్తులు వెళ్లి దర్శించుకునే అవకాశం గల దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతంలో,అద్బుత గుహలు,జలపాతాలు గలిగిన మహిమాన్విత దివ్య శైవ క్షేత్రం “లొద్ది మల్లయ్య ఆలయం“(శ్రీశైలం నుండి హైదరాబాద్ వెళ్లే మార్గంలో 60 కిలోమీటర్ల దూరంలో దిగి దట్టమైన నల్లమల్ల అటవీ ప్రాంతం నుండి ఈ ఆలయానికి చేరుకోవాలి)

DSC00060-1-01
దట్టమైన నల్లమల్ల అటవీప్రాంతం,చుట్టూ లింగాకార ఆకారంలో ఉండే లోయ,ఆ లోయ లో వెలిసిన స్వామి వారిని ఏటా తొలి ఏకాదశి రోజు మాత్రమే భక్తులకు దర్శించే అవకాశం ఉంటుంది. ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం,ఆధ్యాత్మిక,ఆహ్లాద వాతావరణంలో కోట్ల సంవత్సరాల క్రితం వెలసిన లొద్ది మల్లయ్య స్వామి
మహబూబ్ నగర్ జిల్లా(NAGAR KURNOOL DIST), అమ్రాబాద్ గుట్టల్లో ఉంది. ఆ గుట్టల్లో ఉన్న ఒక వింత లోయలో లొద్ది మల్లయ్య స్వామి వెలిసారు. హైదరాబాద్ నుంచి 145 కిలో మీటర్లు, శ్రీశైలం నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉన్నది.

IMG20190711133936
హైదరాబాద్- శ్రీశైలం రోడ్డుకు కిలోమీటర్ దూరంలో అమ్రాబాద్ అడవుల్లో లొద్ది మల్లయ్య ఆలయం కనిపిస్తుంది. దట్టమైన నల్లమల్ల అటవీప్రాంతం,చుట్టూ లింగాకార ఆకారంలో ఉండే లోయ,ఆ లోయ లో వెలిసిన స్వామి వారిని ఏటా తొలి ఏకాదశి రోజు మాత్రమే భక్తులకు దర్శించే అవకాశం ఉంటుంది.

DSC00125-1-01
లొద్ది మల్లయ్య ఆలయానికి వెళ్లే అటవీ దారిలోముందుగా ఒక పెద్ద లోయ వస్తుంది. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్లాలి. ధారవాగు నుంచి తూర్పు వైపునకు మళ్లితే అద్భుతమైన విశాలమైన గుహ కనిపిస్తుంది. ఎత్తయిన గుట్ట నుంచి గొడుగు లాగా ఒక దరి పడమటి వైపునకు పొడుచు కొచ్చినట్టు ఉంటుంది. దాని లోపలికి వెళ్తే ఆలయం కనిపిస్తుంది.
కొండల్లో కనిపించే వింతైన లోయను స్థానికులు లొద్ది అని పిలుస్తారు. కొందరు గుండం అని కూడా అంటారు. ఈ ప్రాంతంలోనే మల్లన్న స్వామి వెలిశాడు కాబట్టి లొద్దిమల్లయ్య గుడి అని ఆ ఆలయాన్ని పిలుస్తారు.


ఈ ఆలయం మొత్తం గుహలోనే ఉంటుంది. ఒకటి తర్వాత ఒకటి గుహలు వస్తుంటాయి. అంతా చీకటి ఉంటుంది. అలా ముందుకెళ్తే చిమ్మచీకట్ల మధ్యన వెలుగునిస్తూ శివలింగం కనిపిస్తుంది. ఇదే ఈ ఆలయ విశిష్టతగా భక్తులు చెప్తుంటారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద బండరాయిపై గుండం ఉంటుంది. గుండంలో స్నానం చేసి ఉత్తరం వైపు మళ్లితే స్వామి దర్శనం చేసుకోవచ్చు. మూడున్నర వందల కోట్ల సంవత్సరాల కింద జీవించిన తొలి సూక్ష్మజీవుల కాలంనాటి పురాతనమైన గుహగా ఈ లొద్దిని భావిస్తున్నారు. స్వామివారికి సమీపంలో ఉన్న త్రిభుజాకారపు రాతి ముక్కనే దీనికి నిదర్శనంగా స్థానికులు అంటున్నారు. దాని మీద జీవావశేషాలను స్థానికులు బ్రహ్మరాత అంటారు. ఆదిమానవులు ఈ గుహల్లో తలదాచుకున్నారని కూడా అంటుంటారు.

This slideshow requires JavaScript.


లొద్దికి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో 5 కిలోమీటర్ల పొడవు, వెడల్పులతో నిర్మితమైన చంద్రగుప్తి పట్టణం శిథిలాలున్నాయి. ఇది మౌర్య చక్రవర్తి చంద్రగుప్తుని కాలానిదిగా స్థానికుల అభిప్రాయం. మరికొందరేమో రెండవ చంద్రగుప్తుని కాలానిదిగా పేర్కొంటున్నారు. పండితారాధ్య చరిత్ర, శ్రీపర్వత పురాణం వంటి ప్రాచీన గ్రంథాలలో వర్ణించిన గుప్త మల్లి ఖార్జున క్షేత్రం ఇదేనని కొందరి అభిప్రాయం. ఇక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో ఉమామహేశ్వరాలయం, 30 కిలోమీటర్ల దూరంలో సలేశ్వరం ఉన్నాయి. లొద్దిలోని లోపలి గుహలోని లింగానికి, గుప్తమహేశ్వరాలయంలోని లింగానికి పోలికలున్నట్లు చెప్తుంటారు.


క్రీస్తుశకం 1వ శతాబ్దం నాటికే కృష్ణాతీరం పొడవునా ఇటుకలతో నిర్మించిన శివాలయాలు వెలిశాయని, అందులో లొద్ది మల్లయ్య ఆలయం ప్రముఖమైనదని భక్తులు చెప్తున్నారు. లొద్ది వైపు ప్రారంభమయ్యే దారి మధ్యలో కూడా ప్రాచీన ఇటుక నిర్మాణాలే ఉన్నాయి. ఇలాంటి లింగాలే చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలో, విశాఖజిల్లాలోని శంకరం దగ్గర కనిపిస్తాయట. సలేశ్వరం ఆలయం ముందరి గోడపై సర్వే శ్వరం అని రాసి ఉంది. కాబట్టి సర్వేశ్వర తీర్థంలో కలిపి పేర్కొన్న పుష్కరతీర్థం ఈ లొద్దిలోని గుండమే అని చెప్పవచ్చు.

DSC00122-1-01

ఇక్కడ జలధారల కింద నిలబడి స్నానమాచరిస్తే పాపాలు తొలిగిపోయి, బుద్ధి సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. అద్బుత ప్రపంచం లాంటి లొద్దిమల్లయ్య ఉండే ప్రాంతానికి వెళ్లాలంటే తొలి ఏకాదశి న మాత్రమే అవకాశం ఉంది.అవకాశం ఉన్న వారు తప్పక స్వామి వారిని దర్శించండి.

 

IMG20190712071631
లొద్ది మల్లయ్య ను దర్శించాలంటే శ్రీశైలం నుండి హైదరాబాదు వెళ్లే బస్సు ఎక్కి 65 కిలోమీటర్ల రాయి దగ్గర దిగి ఎడమవైపుకు మూడు కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.

DSC00136-1-01

అలాగే హైదరాబాదు నుండి ప్రయాణం చేసేవారు శ్రీశైలం బస్సు ఎక్కి 145 కిలోమీటర్ల రాయి దగ్గర దిగి కుడివైపుకి ప్రయాణం చేయాలి. ఇది కాక మరొక నడక మార్గం కూడా అందుబాటులో ఉంది.

IMG20190712065601

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట దగ్గర బాణాల, చౌటపల్లి గ్రామాల నుండి 12 కిలోమీటర్లు నడక ద్వారా లొద్ది మల్లయ్య చేరుకోవచ్చు.

This slideshow requires JavaScript.

ఈ మార్గంలో మనకు మైసమ్మ విగ్రహాలు కూడా కనిపిస్తాయి. నడక మార్గం ద్వారా వచ్చే వారు మైసమ్మ కు కొబ్బరికాయ కొట్టి కొంత సేపు విశ్రాంతి తీసుకొని బయలుదేరుతారు.

This slideshow requires JavaScript.

ఈ నడక మార్గంలో వచ్చే వారు 30 అడుగుల ఎత్తు ఉండే ఇనుప నిచ్చెన ఎక్కవలసి ఉంటుంది. ఇది కొంచెం కష్టమైన పని.

MALLEMKONDA SIVA TEMPLE,NEAR BADVEL,Y.S.R KADAPA DISTRICT,ANDHRA PRADESH.

మల్లెం కొండ:

అది దట్టమైన అటవీ ప్రాంతం… పక్షుల కిలకిలారావాలు… జలపాతాల గలగల ధ్వనులు … ఆ అరణ్యంలోని చెట్టుపుట్టగుట్ట అన్నీ శివనామస్మరణ చేస్తున్నట్లుగా భాసిస్తుంది… అణువణువూ ఆ మహాశివుని దివ్యస్వరూపంగానే దర్శనమిస్తుంది… ఈ ప్రాంతం వైఎస్సార్‌ జిల్లా గోపవరం మండలం మల్లెంకొండ.ఆలయానికి పైకప్పు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత. వైఎస్సార్, నెల్లూరు జిల్లా సరిహద్దుగా ఈ మల్లెంకొండ ఉంది.

20181123_081611-01

ఆలయ విశేషాలు:
పరమశివుడు మల్లెం కొండేశ్వరుడిగా ఇక్కడ వెలిశాడని భక్తుల విశ్వాసం. ఇక్కడి కొండలోని గుండాలలో స్నానం చేస్తే సకల రోగాలు నయమవుతాయని భక్తుల విశ్వాసం. ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి సత్సంతానం కలుగుతుందని చెబుతారు.

20181124_064803

పూలమాల ఆకృతి:
ఈ గిరి శిఖరం పూలమాల ఆకారంలో ఉండటం విశేషం. ఈ శిఖరానికి మాల్యాద్రి శిఖరం అని పేరు. ఈ శిఖరం మీద కాశీవిశ్వనాథుడు, మల్లెం కొండేశ్వరుల ఆలయాలు కనువిందు చేస్తాయి. ఆలయం నుంచి మరో 2 కిలోమీటర్లు నడిచి వెళితే… రామసరి జలపాతం మార్గాయాసాన్ని మర్చిపోయేలా చేస్తుంది.

IMG_20181124_080723-01

మరో మకర జ్యోతి లా కనిపించే మల్లె కొండ:

కడప జిల్లా గోపవరం దగ్గర ఆహ్లాదమైన ప్రక్రుతి మధ్య మల్లెం కొండ ఉంది .కార్తీక మాసం లో ప్రతి రోజు సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు కొండల మధ్య చరియ లో ‘’తేజో వంత మైన కాంతి ‘’కనిపించటం విశేషం .ఈచరియ లో ముడి రసాయన పదార్ధం ఏదో ఉండి ఉంటుందని దానిపై సూర్య కిరణాలు పడినప్పుడు ఈ కాంతి వస్తుందని భావిస్తున్నారు .ఇక్కడి స్వామిమల్లీశ్వరుడి నే మల్లయ్య అంటారు .స్వామిని శ్రీరాముడు ప్రతిష్టించినట్లు స్తానిక కధనం . మల్ల య్య కొండ గా పిలువబడి ఇప్పుడు మల్లెం కొండ అయింది .

20181123_193900

కాకులు కనిపించని కానలు:
సాధారణంగా అడవుల్లో జంతువులు, క్రూరమృగాలు, పక్షులు నివసిస్తాయి. కాని ఈ ప్రాంతంలో మాత్రం కాకి కాని, పులి కాని కనిపించదు. అడవుల్లో ఎక్కువగా పెరిగే ఏపి చెట్లు కూడా కనిపించవు. ఇందుకు సంబంధించిన స్థానిక కథనం ఇలా ఉంది… కొండమీద వెలసిన శివుడు, మల్లెం కొండయ్య, అంకమ్మలకు కొన్ని శతాబ్దాల క్రితం పరిసర గ్రామపెద్దలు ఆలయాన్ని నిర్మించాలని నిశ్చయించారట.

DSC07704

అంతవరకు మొండి గోడల మధ్యన కొలువుతీరిన ఈ దేవతామూర్తులు ఎండకు ఎండకుండా, వానకు తడవకుండా ఉండేలా, పైకప్పు నిర్మాణం ప్రారంభించారు. అయితే, పై కప్పు వేసిన మరుసటి రోజే ఆ కప్పు కూలిపోతుండటంతో ఇది ఎలా జరుగుతోందో తెలుసుకుందామని కాపు కాశారట. అర్ధరాత్రప్పుడు ఓ యువకుడు గుర్రం మీద స్వారీ చేస్తూ వచ్చి ఆ కప్పును కూల్చేయడం కనిపించింది. దాంతో గ్రామస్తులు ఆగ్రహంతో అతన్ని పట్టుకుని, ఏపి చెట్ల నారతో చేసిన తాళ్లతో బంధించారట. తాను మల్లెం కొండేశ్వరుడినని, తనకు కానీ ఇక్కడున్న శివుడికి కానీ ఆలయానికి పై కప్పు వేయరాదని చెప్పాడట. అంతేకాకుండా తనను కట్టి వేయడానికి సహకరించిన ఏపి చెట్లు ఈ అడవుల్లో కనిపించకూడదని శపించాడట. మల్లెం కొండయ్యను బంధించినప్పుడు ఓ కాకి ఆయన కళ్లను పొడవబోయిందట. దాంతో ఆ అరణ్యంలో కాకి కానరాకూడదని శపించాడట.

IMG_20181124_152033-01

పులి కనిపించని అడవి:
ఈ పర్వత ప్రాంతంలో నివసించే ఒక గిరిజన భక్తుడు తన గోవులను మేపుకోవడానికి అడవికి వచ్చేవాడట. అక్కడ సంచరించే పులులు అదను చూసి గోవులపై దాడి చేశాయట. ఆ గిరిజనుడు శివునితో తన గోడు చెప్పుకున్నాడట. శివుడు ఈ అరణ్యంలో పులులు సంచరించరాదని ఆఙ్ఞాపించాడట. అందుకే ఈ అరణ్యంలో నేటికీ పులి కనిపించదు.

20181124_064857

రాముడు సైతం…
శ్రీరామచంద్రుడు రావణసంహారం అనంతరం సీతతో కలసి ఈ మాల్యవంత పర్వత ప్రాంతానికి వచ్చాడట. ఇక్కడి ప్రకృతి రమణీయతకు పరవశించి కొంతకాలం ఇక్కడే ఉండిపోయాడట. అప్పుడే మల్లెంకొండలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థలపురాణం. ఈ క్షేత్రానికి ఎనిమిది దిక్కుల్లోనూ నీటి గుండాలను ఏర్పాటు చేశారట.

20181123_072637

కొండమీద మల్లెంకొండేశ్వరుని ఆలయం చేరుకోవాలంటే 5 కిలోమీటర్లు దట్టమైన అటవీప్రాంతంలో కొండకోనలు దాటుకుంటూ వెళ్లాలి. కాలినడక తప్ప మరో మార్గం లేదు. దాంతో సంవత్సరంలో ఒక్కశివరాత్రి రోజే.. భక్తులు ఈ ఆలయానికి వెళ్లేవారట. దశాబ్దం క్రితం సుబ్బారాజు గారు అనే భక్తుడు ఆలయ జీర్ణోద్ధరణతో పాటు అక్కడ వసతి, తాగునీరు, సోలార్‌లైట్లు, వంటసామగ్రి ఏర్పాటు చేయడంతో భక్తులు ప్రతివారం వెళుతున్నారు. కార్తీక పౌర్ణమి కి మూడు రోజులపాటు ఉ తిరునాళ్ళు అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు.

This slideshow requires JavaScript.

ఎలా వెళ్లాలంటే…
నెల్లూరు–కడప జిల్లాల సరిహద్దు ప్రాంతంలో ఉంది. కడప జిల్లా బద్వేల్‌ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో బ్రాహ్మణపల్లె గ్రామం నుంచి కొండకు నడిచి వెళ్లాలి. కడప నుంచి బద్వేల్‌కు, బద్వేల్‌ నుంచి బ్రాహ్మణపల్లెకు బస్సు సౌకర్యం ఉంది. కడప నుంచి 60 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి 100 కిలోమీటర్లు. నెల్లూరు నుంచి బద్వేల్‌ వెళ్లే బస్సులో పి.పి.కుంట వరకు వెళ్లి, అక్కడ నుంచి బ్రాహ్మణపల్లెకు మరో బస్సులో వెళ్లాలి. పి.పి.కుంట నుండి మల్లెంకొండ దిగువ వరకు ఆటోలు అందుబాటులో ఉంటాయి.

Mallemkonda vedio-1

Mallemkonda vedio-2

PALANKA VEERABHADRA SWAMY TEMPLE,PALUTLA VILLAGE,NALLAMALA FOREST AND TREK TO SRISAILAM

పాలంక గుడి, పాలుట్ల గ్రామం, నల్లమల అడవి:

పాలుట్ల గ్రామం ఈ ఊరు గురించి పెద్దగా విని ఉండకపోవచ్చు ఊరిని ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. నల్లమల అడవుల్లో మధ్యభాగంలో ఉన్న అందమైన పెద్ద గ్రామం. ఇక్కడికి చేరుకోవాలంటే సరైన రహదారి కూడా లేదు. ఈ గ్రామంలో 1500 మంది చెంచు, సుగాలి గిరిజన జాతులకు చెందిన ప్రజలు నివసిస్తారు. చెంచు గిరిజనుల జీవన విధానం దగ్గరనుండి పరిశీలించాలంటే పాలుట్ల అనువైన ప్రాంతం.

DSC00248-01

ఈ గ్రామ ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసరాలను పండించడం ద్వారా, అడవి నుంచి సేకరించడం ద్వారా పొందుతారు. దాదాపు 360 ఎకరాల సాగుభూమిలో పత్తి, మిరప పంటలు పండిస్తారు గ్రామ ప్రజలు తమకు కావలసిన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడం ద్వారా స్వయం సమృద్ధిగా ముందుకు సాగుతున్నారు.

DSC00233-01

ఇక్కడ పండే పత్తి, మిరప పంటల ఉత్పాదకత ఎక్కువగా ఉండటంవల్ల అప్పుడప్పుడు కాలేజీ విద్యార్థులు పరిశోధన కోసం ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు.అధికారులు 5 సంవత్సరాలలో ఒకసారి మాత్రమే అనగా ఎన్నికల సమయంలో హెలికాఫ్టర్ ద్వారా వచ్చే పోలింగ్ నిర్వహించి వెళ్ళిపోతారు. ప్రతినెల రేషన్ సరుకులు అందించడానికి మరియు వైద్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే లారీలు, జీపులు వెళ్తూ ఉంటాయి.

DSC00086-01

పిల్లలకు చదువు చెప్పేందుకు గిరిజన ఆశ్రమ పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో పాలుట్ల, గుట్టలచేనుపెంట‌, నారు తడికల పెంట, నెక్కంటి గ్రామాలకు చెందిన సుమారు వందమంది విద్యార్థులు చదువుకుంటున్నారు.ఉన్నత పాఠశాల చదువు చదవాలంటే మాత్రం ప్రకాశం జిల్లాలోని గిరిజన హాస్టల్స్ లో చేరాల్సిందే! పాలుట్ల గ్రామం నుండి దట్టమైన అరణ్యంలో క్రూర మృగాల మధ్య 12 గంటల ప్రయాణించి చినారుట్ల గ్రామం చేరుకొని అక్కడి నుండి బస్సు ద్వారా హాస్టల్ కి వెళ్ళవలసి ఉంటుంది .

 

This slideshow requires JavaScript.

పాలుట్ల గ్రామం చేరుకోవడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి గుడి మీదగా, ఇది కేవలం నడకదారి మాత్రమే ఇష్టకామేశ్వరి వరకు జీపు మార్గం అందుబాటులో ఉంది. అక్కడినుంచి 30 కిలోమీటర్లు కాలినడకన వెళ్ళవలసిందే. ఇకపోతే రెండవ మార్గం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మీదగా, పదిహేను కిలోమీటర్లు దూరం ఉన్న గంజివారి పల్లె కు వెళితే అక్కడ నల్లమల అడవిలో కి ప్రవేశిస్తాం. అక్కడనుండి ఆరు గంటలపాటు రాళ్లతో కూడిన దారుణమైన రోడ్డులో 50 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే పాలుట్ల గ్రామాన్ని చేరుకోవచ్చు. కమాండర్ జీపులు, లారీలు, ట్రాక్టర్ ల మీద మాత్రమే ప్రయాణించడానికి వీలు ఉంటుంది. బైకు మీద అతికష్టం మీద ప్రయాణించిన రిపేరు వస్తే చాలా ఇబ్బంది పడాలి.

IMG_20180724_075630-01
పాలుట్ల గ్రామంలో ఎటువంటి ఆధునిక సౌకర్యాలు ఉండవు. సోలార్ పవర్ ద్వారా లైట్లు ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తానికి ఒక కాయిన్ ఫోన్ అందుబాటులో ఉంది. చదువుకున్న యువకులు 20 మీటర్ల పొడవైన వెదురుబొంగు తో సెల్ టవర్ ఒకటి ఏర్పాటు చేశారు. దాని ద్వారా శ్రీశైలం లో ఉన్న టవర్ signals అందుకొని పక్క గ్రామాల బంధువులతో మాట్లాడగలుగుతున్నారు.

IMG-20180803-WA0081-01

చారిత్రక పుస్తకాల్లో పేర్కొన్న ఈ గ్రామంలో చూడవలసినవి. గ్రామములో ఒక రామాలయం మరియు గ్రామ శివారులో ఉన్న హనుమంతుని ఆలయం. అంతేకాక ఈ గ్రామానికి 6 నుండి 7 కిలోమీటర్ల దూరములో దూరంలో గుట్టల చెరువు పెంట గ్రామపరిధిలో రెండు కొండల మధ్య ఒక పెద్ద లోయ ఉంది. లోయలోని కొండ గుహలో ప్రసిద్ధిచెందిన ప్రాచీనమైన వీరభద్రస్వామి ఆలయం ఉంది. ఈ ప్రాంతాన్ని పాలంక అంటారు. ఈ ఆలయంపై ఉన్న కొండపై నుండి వాగు (Stream) దూకటం వల్ల జలపాతం ఏర్పడింది. ఇది వర్షాధారం, బాగా వర్షాలు పడినప్పుడు చాలా పెద్దదిగా ఉంటుంది. దీన్ని ఆంధ్ర నయాగరా జలపాతం అన్నా అతిశయోక్తి లేదు.

 

పాలంక వీరభద్ర స్వామి ఆలయం:

ఈ ఆలయ చరిత్ర చూస్తే విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయలు తన తూర్పు దండయాత్రలో భాగంగా గజపతులను ఓడించి తిరుగు ప్రయాణంలో శ్రీశైలాన్ని సందర్శించారు. అలా కృష్ణానది ఒడ్డున ప్రయాణం సాగిస్తుండగా దారి దోపిడీ దొంగలనుంచి తమని కాపాడాలని ప్రజలు రాయల వారిని వేడుకున్నారు.

అప్పుడు తన సైన్యాధిపతులైన బోడ వెంకటపతి నాయుడు, నలగాటి పెద్ద తిమ్మానాయుడు కు ఈ ప్రాంతాన్ని జాగీరుగా ఇచ్చి నది పక్కన ఆగటం కోట నిర్మించారు. అక్కడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో పాలంక వీరభద్రుడు, భద్రకాళీ మాత ను ప్రతిష్టించి ఆ ప్రాంత రక్షణ బాధ్యతను తన సైన్యాధిపతులకు అప్పగించారని చరిత్ర చెబుతుంది.

This slideshow requires JavaScript.


నల్లమల అడవుల్లో సంవత్సరానికి ఒకసారి మాత్రమే దర్శించుకునే ప్రాచీన ఆలయాలు ఎన్నో ఉన్న పాలంక వీరభద్ర స్వామి ఆలయం ప్రత్యేకత సంతరించుకుంది. దట్టమైన అరణ్యంలో పచ్చని చెట్లు పెద్ద కొండ చరియపై జాలువారే జలపాతం భక్తులను మైమరిపిస్తుంది. ఆదిశేషుని ఆకారంలో సహజసిద్దంగా ఏర్పడిన కొండచరియ కింద మూలవిరాట్ పాలంకేశ్వరుడితోపాటు వీరభద్రుడు ,గణపతి, పంచముఖ బ్రహ్మ, పోతురాజు ఆలయాలు పది అడుగుల ఎత్తు నాగమయ్య పుట్ట ఉన్నాయి.

ఆలయం కు సంవత్సరములో మూడు రోజులపాటు తిరునాళ్లు జరుగుతాయి. ఈ సమయంలో ప్రకాశం, గుంటూరు మహబూబ్ నగర్, కర్నూలు జిల్లాల నుంచి భక్తులు వేల సంఖ్యలో పాలంక ను దర్శిస్తారు. ఈ సంవత్సరం జులై 23, 2018 న ఏకాదశి పండుగ కావున july 22, 23 ,24 తేదీలలో పాలంక ను దర్శించుకోవచ్చు. ఆ రోజుల్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. పాలంక నుండి పాలుట్ల గ్రామం దర్శించటం సులువు. పాలుట్ల గ్రామంలో కూడా తొలిఏకాదశి రోజున అన్నదాన కార్యక్రమం ఉంటుంది. సంతాన ప్రాప్తి కోసం భక్తులు అధిక సంఖ్యలో ఈ క్షేత్రాన్ని దర్శిస్తుంటారు.

DSC00247-01
కొంతమంది భక్తులు ఎర్రగొండపాలెం నుండి పాలంక కు లారీల్లో వచ్చి అక్కడ దర్శనం చేసుకొని అక్కడ నుంచి నడక మార్గం ద్వారా పాలుట్ల, నెక్కంటి, ఇష్టకామేశ్వరి మీదగా శ్రీశైల దర్శనం కూడా చేసుకుంటారు. పాలంక ప్రయాణించే భక్తులు గంజివారి పల్లె నుండి బయలుదేరి అడవిమార్గంలో 20 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఒకటి వస్తుంది. ఆ ప్రాంతాన్ని పెద్దమ్మ అంటారు. అక్కడ భక్తులందరూ ఆగి చెంచు దేవతలైన పెద్దమ్మ, పసిమ్మ ప్రతిమలకు తమ ప్రయాణం సజావుగా సాగాలని కొబ్బరికాయ కొట్టి ముందుకు సాగిపోతారు.


తొలి ఏకాదశి కి ఎలాంటి అనుమతులు లేకుండా పాలంక వీరభద్ర స్వామిని, పాలుట్ల గ్రామాన్ని సందర్శించవచ్చు. మిగిలిన సందర్భాల్లో వెళ్లాలంటే ఫారెస్ట్ అధికారుల అనుమతి తప్పనిసరి..
పాలంక లోయలో కృష్ణా నది వైపు 6 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే అల్లాటం కోటకు చేరుకోవచ్చు. ఇది ఒక బోయ కోట. తూర్పు చాళుక్యులు, విజయనగర రాజుల కాలంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలో దాదాపు 13 బోయ కోటలు ఉండేవి. వాటిలో ఒకటి ఆలాటం కోట. గతంలో మేము ఇష్టకామేశ్వరి నడిచి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో కనిపించిన పాలుట్ల గ్రామానికి చెందిన ఎలమంద నాయక్ ఈ కోట గురించి వివరాలు చెప్పారు. ఇక్కడ ఒక వదిలివేయబడిన ఫిరంగి కూడా ఉందని చెప్పారు.

FB_IMG_1534934304425-01
శ్రీశైలానికి నాలుగువైపులా నాలుగు ద్వారాలు ఉన్నాయి 1950వ దశకంలో ఘాట్ రోడ్ నిర్మించకముందు ఈ ద్వారాల గుండా కాలినడకన భక్తులు శ్రీశైల దర్శనం చేసుకొనేవారు. శ్రీశైల ఉత్తర ద్వారం త్రిపురాంతకం. త్రిపురాంతకం నుండి శ్రీశైలానికి ఎర్రగొండపాలెం, ganjivaripalli, పాలంక ,పాలుట్ల ,నెక్కంటి, ఇష్టకామేశ్వరి మీదగా శ్రీశైల దర్శనం చేసుకొనేవారు. అందుకనే ఈ మార్గాల్లో జనావాసాలు ,చిన్న గుళ్ళు వెలిశాయి.
వచ్చే తొలి ఏకాదశి కి మేము ఎర్రగొండపాలెం నుంచి లారీలో పాలంక కు చేరుకొని అక్కడినుంచి పాలుట్ల గ్రామం చేరుకుంటాం. వీలైతే శ్రీశైలము నడక ద్వారా చేరుకునే ప్రయత్నం చేస్తాం.

FB_IMG_1534934396088-01
మేము తెనాలి( గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్) నుండి ముగ్గురము కనిగిరి( ప్రకాశం జిల్లా) నుండి ముగ్గురు మొత్తం ఆరుగురు కలిసి బృందంగా ఏర్పడి ఎర్రగొండపాలెం నుండి లారీలో పాలంక వీరభద్ర స్వామిని దర్శించుకొని (జులై 22 2018) అక్కడినుండి తొలి ఏకాదశి రోజున( జులై 23, 2018) ఉదయం 6 గంటలకు పాలుట్ల దిశగా కాలినడక సాగించాం ఆరు ఏడు కిలోమీటర్లు నడిచిన తర్వాత రెండు వాగులు దాటి గుట్టల చెరువు పెంట అనే గ్రామాన్ని చేరుకున్నాము.

 

This slideshow requires JavaScript.

దాదాపు 30 నుండి 40 కుటుంబాలు ఈ గ్రామంలో నివాసం ఉంటున్నాయి. కొంతమంది గ్రామస్థులతో మాట్లాడి 5 కిలోమీటర్లు ప్రయాణించి పదకొండు గంటలకల్లా పాలుట్ల గ్రామం చేరుకున్నాము మేము వెళ్లేసరికి రామాలయంలో అన్నదాన కార్యక్రమం అంగరంగవైభవంగా జరుగుతుంది.

పాలుట్ల గ్రామ శివారులో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం చాలా ప్రాచీనమైనది. దాని ప్రక్కనే ఒక శివాలయం కూడా నిర్మాణంలో ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే పాలుట్ల పాఠశాల గురించి విశాలమైన గదులు చాలా పెద్ద ప్రాంగణం చుట్టూ అడవి ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.

DSC00212-01

రామాలయంలో భోజనం చేసి కొంత సమయం విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్లీ మా నడక నెక్కంటి వైపుగా సాగింది మా నడకలో అతికష్టమైన భాగం పాలుట్ల, నెక్కంటి మధ్యలో ఉంది. అదే నెక్కంటి కొండ.

 

IMG_20180723_134214-01

దాదాపు రెండు గంటలు భుక్తాయాసం తో కష్టపడి కొండ ఎక్కి ఒక మైదాన ప్రాంతానికి( కొండల మధ్యలో ఉన్న చదునైన భూమి) చేరుకున్నాం. అదే నెక్కంటి మార్గంలో గూగుల్ మ్యాప్ లో నక్కిపెంట అనే ఊరు దారిలో ఉన్న వాస్తవంగా మాకు ఆ ఊరు కనిపించలేదు. నెక్కంటి లో ఆ ఊరు గురించి అడిగాను అలాంటిది లేదని చెప్పారు( బహుశా నక్కిపెంట గ్రామం వేరే చోటకి మారి ఉండిఉండవచ్చు.

చెంచుల ఆచారం ప్రకారం గ్రామంలో ఎక్కువ రోగాలు వచ్చినా, ఆకస్మికంగా ఎక్కువ మరణాలు సంభవించినా, ప్రజల మధ్య గొడవలు ఏమైనా అయినా ఆ గ్రామాన్ని విడిచి పెట్టి వేరేచోట గ్రామం నిర్మించుకునే అలవాటు ఉంది) నెక్కంటి లో మొత్తం నాలుగు గుడిసెలు ఉంటాయి. ఈ గ్రామం కూడా మైదాన ప్రాంతం కావడంతో వీరు ఎక్కువగా ఆవులను మేపుతున్నారు.

FB_IMG_1534934326869-01

నెక్కంటి దాటి ఒక కిలోమీటరు ఇష్టకామేశ్వరి వైపు ప్రయాణం చేస్తే నెక్కంటి వాగు తగులుతుంది. వాగు దగ్గర కాసేపు విశ్రాంతి తీసుకుంటుండగా అప్పుడప్పుడే వాతావరణం మారిపోయి నల్లని మబ్బులు పట్టి ఈదురుగాలులతో ఒక అరగంట వర్షం కురిసింది. వర్షంలో తడిసిన మాకు అంత ఉపశమనం కలిగి అదనపు శక్తి వచ్చినట్టుంది.

అక్కడినుండి ఇష్టకామేశ్వరి దిశగా మా ప్రయాణం కొనసాగింది. నాలుగు గంటల ప్రాంతంలో మేము అంకలేటివాగు చేరుకున్నాము. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుంటుండగా మళ్లీ వర్షం వచ్చింది. వర్షంలో తడుచుకుంటూ మేము సాయంత్రం ఆరుగంటలకల్లా ఇష్టకామేశ్వరి చేరుకోగలిగాము.

ఇష్టకామేశ్వరి నుండి ఇంకా 12 కిలోమీటర్లు నడిస్తే కానీ శ్రీశైలం ఘాట్ రోడ్డు చేరుకోలేము. చీకటి పడటంతో వన్యప్రాణులు తిరిగే అవకాశం ఉంది కనుక భద్రత దృష్ట్యా ఆ రాత్రికి ఇష్టకామేశ్వరి లోనే బస చేయాలనుకున్నాం. ఇంతలో మాతోపాటు కనిగిరి నుంచి వచ్చిన ముగ్గురు అత్యవసర పని దృష్ట్యా వద్దని వారించినా వెళ్దామని నిర్ణయించుకున్నారు.

This slideshow requires JavaScript.

రాత్రి కావడం అందులో వారికి ఆ రూటు తెలియదు. మా దగ్గరున్న టపాకాయలు మరియు లైటర్ ఇచ్చి కొన్ని దారి గుర్తులు చెప్పి పంపించాము. జియో ఫోన్ సిగ్నల్స్ అందడంతో వారిని గైడ్ చేశాము. రాత్రి 8 గంటల టైం లో చీకటి బాగా పెరగడంతో ఎదురు బొంగు ని తీసుకొని ఒక చివర చీల్చి దాంట్లో గడ్డి మరియు క్లాత్ పెట్టి నిప్పు వెలిగించడం జరిగింది. ఎట్టకేలకు 9:30 సమయంలో ఇష్టకామేశ్వరి ఎంట్రెన్స్ గేట్ చేరారు. అక్కడ ఉన్న ఫారెస్ట్ గార్డ్ కొంత విచారణ చేసి పంపించారు. మేము హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం.

IMG_20180724_080120-01

ఇక మా సంగతికి వస్తే ఇష్టకామేశ్వరి లో మాకు ఎటువంటి ఆహారం దొరకలేదు. మా దగ్గర ఉన్న మూడు రోజుల క్రితం చేసిన రొట్టెలను భుజించి ఇష్టకామేశ్వరి గుడి ముందు ఉన్న షెడ్లో నిద్రకు ఉపక్రమించాము. ఇక్కడ ఆరుగురు చెంచుల ఇళ్ళు కూడా ఉన్నాయి. సోలార్ పవర్ ద్వారా వారికి కరెంటు సదుపాయం కల్పించారు.

IMG_20180724_080044-01

గుడి పక్కనే కామాక్షమ్మ వాగు ప్రవహిస్తూ ఉంటుంది. రాత్రిపూట ఎలుగుబంటి లాంటి కొన్ని జంతువులు నీటి అవసరాల కోసం ఇక్కడ వస్తాయని అక్కడ వారు మాతో చెప్పారు. అర్ధరాత్రి లేచి చూడగా చెంచులకు చెందిన వేట కుక్కలు నాలుగు తిరుగుతూ కాపలా కాస్తూ కనిపించాయి. ఇక మేము ధైర్యంగా పడుకున్నాము.

ఉదయం లేచి కామాక్షమ్మ వాగులో స్నానం చేసి ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకుని శ్రీశైలం వైపు మా నడక ప్రారంభించాము. మధ్యాహ్నం 12 గంటలకు శ్రీశైలం చేరుకొని, దర్శనం చేసుకొని వెంటనే గుంటూరు బస్సు ఎక్కాం.

IMG_20180724_070217-02

దీంతో మా 40 కిలోమీటర్ల ఆఫ్ రోడ్ ప్రయాణము మరియు 40 కిలోమీటర్ల నడక పూర్తయి సంతోషంగా ఇంటికి చేరాము.
——————————————————————————————————— వేదాద్రి నల్లగొర్ల
…………………………………………………………………………………………………………………..9346776582

PALANKA VEERABADRA TEMPLE,NALLAMALA FOREST,PRAKASAM Dt,A.P

 

for youtube vedio

Palanka Veerabhadra Swamy Cave temple, Nallamala forest …

SALESWARAM,TELANGANA AMARNATH,NALLAMALA FOREST,NEAR SRISAILAM

Saleshwaram temple is a Lingamaiah temple (Shiva temple) located in Nagar-karnool district of Telangana.The temple is inside a cave in Nallamala forest near Shrisailam.The ancient Sri Ramalingeshwara Swamy temple of 6th century AD, located deep inside Nallamala forest in Lingala mandal, is about 1,000 feet deep inside a valley. The annual fete is celebrated every year on Chiatra Pournami.

DSC07340

 

 

The significant feature of this temple is that, it will be opened only for 3 to 5 days during Chitra Purnima or the full moon day in March/April.  It is famous for its wedge-shaped water fall,which seems to have been chiselled across a huge stone.  The Shiva Linga is in a cave next to the waterfall.

DSC07244

 

Lingamaiah Jathra,  a fair will be organised in Sleshwaram temple,  once in a years. It attracts thousand of devotees towards the temple.Devotees from across Telangana and neighbouring districts of Andhra Pradesh arrived in huge numbers to offer prayers to the presiding deity on the auspicious day of Chitra Pournami.

DSC07326

Saleshwaram Temple is closed most of the year. It is open to devotees only on the first full moon day after Ugadi (Telugu New Year) and usually falls in the month of April.  There will be thousands of people at that time. At other times, one needs to get permission from forest officer to visit this beautiful place. There will be thousands of people, litter and noise everywhere at that time. Saleshwaram is located 25 km away from Farahabad entrance point.The devotees have to walk at least 6 kilometers to reach the temple located down the valley. It is an arduous walk since there are sharp rocks all along the ground.

The devotees need to walk on narrow gorges of valley to reach down the deep valley where they can see waterfall falling from over 1,000 feet.The devotes take a holy dip in the water and collect water in the bottles for those who could not make it as it is believed that it contains medicinal value.There are plenty of buses from Achampet and Nagarkarnool bus depots to reach Saleswaram

This slideshow requires JavaScript.

 సలేశ్వర మల్లికార్జున స్వామి వారి ఆలయ చరిత్ర:

అక్కడి ప్రతి చెట్టు నిత్యం స్మరిస్తూనే ఉంటుంది. ఎత్తయిన కొండల నుంచి జాలువారే ప్రతి నీటి బొట్టు లింగాన్ని తాకాలని తపిస్తూనే ఉంటుంది.ప్రకృతి ఒడిలో కొలువైనట్లు గా కనిపించే సలేశ్వరుడు యాత్ర నాగర్ కర్నూల్ లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది.తెలుగు రాష్ట్రాల అమరనాధ్ యాత్ర గా చెప్పుకునే సలేశ్వరం యాత్ర:ఉగాది వెళ్లిన తొలి పౌర్ణమి సమయం లో కేవలం 5 రోజులు మాత్రమే భక్తులు దర్శించుటకు వీలు కలిగే సలేశ్వర యాత్ర: శివుడు మల్లిఖార్జున స్వామి రూపంలో కీకారణ్యంలో వేలసంవత్సరాల క్రితం వెలసిన క్షేత్రం సలేశ్వరం

DSC07332
హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా ,లింగాల మండలం మన్ననూరు ,అచ్చంపేట గ్రామాల అటవీ ప్రాంతం లో సలేశ్వర మల్లిఖార్జున స్వామి వెలిసారు.చుట్టూ కొండలు ఉండటం వలన శైలాలు(కొండలు) పేరు మీదుగా మొదట శైలేశ్వరం అని కాలక్రమేణా వాడుక భాష లో ప్రజలు సలేశ్వరం గా ఈ ప్రాంతాన్ని పిలవటం మొదలయింది. సలేశ్వర యాత్ర అతి కఠిన తరమైనది కావున తెలుగు రాష్ట్రాల అమర్ నాధ్ యాత్ర గా పేరుపొందింది. హైదరాబాద్ నుండి శ్రీశైలం వచ్చే మార్గ మధ్యలో మన్ననూర్ అటవీ ప్రాంతంలో 150 వ మైలు రాయి వద్ద నుండి అటవీ మార్గం ద్వారా 20 కిలోమీటర్లు వాహనాలు పై ప్రయాణిస్తే సలేశ్వరం కు వెళ్లే మార్గం కు చేరుకుంటాము,ఈ 20 కిలో మీటర్లు కూడా క్లిష్టమైన అటవీ ప్రాంతం,మట్టిరోడ్డు కావటం మరియు సింగిల్ రోడ్డు వల్ల 20 కిలోమీటర్లు చేరుకోవటానికి 4 నుంచి 5గంటల సమయం పడుతుంది,శ్రీశైలం నుండి తిరిగి హైదరాబాదు వెళ్లే మార్గం లో సరిగ్గా 60 కిలోమీటర్లు ప్రయాణిస్తే మన్ననూరు వస్తుంది.

DSC07280

 

 

ఇది దట్టమైన కీకారణ్య ప్రాంతం కావున అటవీ శాఖ అధీనంలో ఉంటుంది.కేవలం చైత్ర శుధ్ధ త్రయోదశి నుండి చైత్ర బహుళ విదియ వరకు మాత్రమే 5 రోజులు స్వామి వారి వార్షిక ఉత్సవాల సమయంలో మాత్రమే భక్తులను ఆలయం వరకు అనుమతిస్తారు.మిగిలిన రోజుల్లో ఈ ఆలయం కు వెళ్లటం అసాధ్యం.ఈ జాతరలో పాల్గొనటానికి తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. జంగమయ్య ను అయిన దర్శించుకొని పరవశిస్తారు. అంతేకాదు తరతరాలుగా స్థానిక చెంచులే ఈ జాతరను నిర్వహించడం విశేషం.

This slideshow requires JavaScript.

 

అద్బుత మైన ప్రకృతి,ఆకాశం తాకే కొండలు,వాటి కిందనుండి పై వరకు పచ్చని చెట్లు,గుహలు,జలపాతాలు ఈ ప్రాంతం సొంతం,అందుకే 17 వ శతాబ్దం లో అలనాటి నిజాం నవాబ్ అటవీ సంచారానికి వచ్చి ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి ముగ్దుడు అయ్యి ఆ రోజుల్లోనే ఈ ప్రాంతంలో వేసవి విడిది పర్హాబాద్ పేరుతో భవనం నిర్మించుకున్నారు. అనగా అందమైన ప్రదేశం అని అర్థం, అంతకు ముందు దాని పేరు’ పుల్ల చెలమల’. 1973 లో ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరిట పులుల సంరక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. అది మన దేశంలోనె అతి పెద్ద పలుల సరక్షణా కేంద్రం.అడవిలో 20 కిలోమీటర్లు వాహనాలపై ప్రయాణించాక వాహనాలు అక్కడ నిలిపి తమకు అవసరమైన దుస్తులు,ఆహార పదార్దాల వంటివి మాత్రమే తీసుకుని కాలి నడకన 5 కిలోమీటర్లు నడవాలి.

This slideshow requires JavaScript.

ఈ జాతర ఎండాకాలంలో అడవిలో జరుతున్నది కనుక కొంతమంది దాతలు ఉచిత భోజన వసతి కలిగిస్తున్నారు. ఈ మార్గం కొండలు,ఇరుకైన ప్రాంతాలు,అతి క్లిష్టమైన సన్నని రోడ్లు కలిగి ఉంటుంది,అలా కొంత దూరం వెళ్ళాక రెండు కొండల మధ్య ఒక వాగు ప్రవాహంకలిగి ఉంటుంది. ఆ కొండలను పట్టుకుని అతి జాగ్రత్తగా అడుగులో ,అడుగు వేస్తూ ఆ వాగు దాటాలి,ఏ మాత్రం కాలు జారినా వాగు ప్రవాహం లో పడిపోతారు.

ఈ ఆలయం లో చైత్ర శుద్ధ పౌర్ణమి  రోజున చంద్రకిరణాలు నేరుగా స్వామి వారి పై ప్రసరించి తేజోమూర్తి అయిన లింగమూర్తి గా స్వామి దర్శన మిస్తారు,సంవత్సరం లో ఒక్కరోజున మాత్రమే ఇలా జరుగుతుంది,కనుకనే ఈ రోజున లక్షలాది భక్తులు స్వామి వారిని దర్శించి కృపపొందుతారు.ఈ ఆలయానికి దగ్గరలో దాదాపు 1000 అడుగుల పై నుండి జాలు వారే తెల్లని స్వచ్చమైన పాలధార లాంటి జలపాతం పడుతుంది,ఈ జలపాతం క్రింద స్నానమాచరించి స్వామిని దర్శిస్తారు. ఈ జలపాతం కింద స్నానమాచరిస్తే దీర్ఘకాలిక రోగాలు మాయం అవుతాయని భక్తుల నమ్మకం.

DSC07330

దట్టమైన అరణ్యం లో ఎన్నో ఔషధ మొక్కలు,ఆకులు ను తాకుతూ పై నుండి జాలు వారే జలం లో అనేక గుణాలు ఉండి రోగాలు నయం చేస్తాయని చెపుతారు. ఈ ప్రవాహం భక్తులు కొద్ది సంఖ్యలో వెళ్తే తక్కువ ధారతో ఎక్కువ సంఖ్యలో వెళ్తే పెద్ద ధారతో పై నుండి పడడం స్వామి లీల అని చెపుతారు. పుట్టకు దారాలు కట్టి పూజ చేస్తే సంతానం లేని వారికి సంతాన ఫలం,తిరుగు ప్రయాణంలో కోరిన కోర్కెలు త్వరగా నెరవేరాలని వివాహం కాని వాళ్లు చలువపందిళ్లు వేస్తారు. ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్లు రాళ్లను ఒకదానిమీద ఒకటి పేర్చి మరోసారి ఆ లింగమయ్యకు మొక్కుకుంటారు. ఈ క్షేత్రానికి వచ్చి శివయ్యను దర్శించుకుంటే ఏడాదంతా పంటలు బాగా పండుతాయన్నది రైతుల విశ్వాసం. కష్టమైనా ఈ నడక ప్రయాణాన్ని సాగిస్తున్న భక్తులు “వస్తున్నాo  వస్తున్నా లింగమయ్య” అంటూ దర్శనానంతరం తిరిగి వెళ్తూ “వెళ్ళొస్తాం వెళ్ళొస్తాం లింగమయ్య” అంటూ చేసే పనుల వల్ల ఈ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది

DSC07333

చారిత్రక ఆధారాలు:

నాగార్జున కొండలో బయట పడిన ఇక్ష్యాకుల నాటి అనగా క్రీ.శ. 260 నాటి శాసనాలలో మూస:చుళధమ్మగిరి గురించిన ప్రస్తావన ఉంది. ఆ గిరిపై అనాడు [[ శ్రీ లంక నుండి వచ్చిన బౌద్ద బిక్షవులు కొరకు అరామాలు, విహారాలు కట్టించారట. ఆ చుళ దమ్మగిరి ఈ సలేశ్వరమే నని నమ్మకం. కారణం అక్కడ ఇక్ష్యాకుల కాలపు కట్టడాలు ఉన్నాయి. లింగమయ్య గుడి గోడల ఇటుకల పరిమాణం 16″/10″/3″ గా ఉన్నాయి. అలాంటి ఇటుకల వాడకం ఇక్ష్వాకుల కాలంలోనె ఉండేది. . “సుళ” తెలుగులో “సుల” అవుతుంది కాబట్టి బౌద్ద క్షేత్రం శైవ క్షేత్ర్తంగా మార్పు చెందాక సులేస్వరంగా ……చివరగా సులేశ్వరంగా మారి వుంటుంది. ఇక్ష్యాకుల నిర్మాణాలకు అధనంగా విష్ణు కుండినుల క్రీ.శ.. 360 —370 కాలపు నిర్మాణాలు కూడా ఉన్నాయి. వీరి ఇటుకల పరిమాణసం 10′”/ 10″/3″ . దిగువ గుహలోని గర్బగుడి ముఖ ద్వారం పైన విష్ణు కుండినుల చిహ్నమగు పూలకుండి శిలాఫలకం ఉంది .

DSC07312

స్థల మహాత్యం అనే ఒక ప్రాచీన తెలుగు క్షేత్ర మహాత్యం కావ్యాలలో సలేశ్వరాన్ని రుద్ర కుండంగా, దీనికి ఈశాన్యాన గల మల్లెల తీర్థం అనే జలపాతాన్ని విష్ణు కుండంగా, పశ్చిమాన గల లొద్ది అనగా గుండాన్ని బ్రంహ కుండంగా పేరొన్నారు. పిష్ణు కుండిన రాజులు ఈ ప్రాంతం నుంచి ఎదిగినారు కనుకనే ఈ ప్రాంతపు పేరు పెట్టుకొన్నారు. ఈ విషయాన్ని ప్రముఖ చరిత్ర కారుడు బి.ఎన్ శాస్త్రి నిరూపించారు.

This slideshow requires JavaScript.

13 వ శతాబ్దంలో పండితారాధ్య చరిత్ర,శ్రీ పర్వత క్షేత్రం రాసిన ప్రముఖ శివ భక్త పండితుడు పాల్కురి సోమనాధుడు తన గ్రంధాలలో సలేశ్వర ఆలయ విశేషాలు తెలిపారు,దీనిని బట్టి ఎంత ప్రాసస్త్యం ఉన్న ఆలయమో మనం గ్రహించవచ్చు.17 వ శతాబ్దం లో శ్రీశైలం దర్శించిన చత్రపతి శివాజీ అడవుల గుండా ప్రయాణించి సలేశ్వరం చేరుకుని స్వామి వారికి ఆరాధించినట్లు చారిత్రక కధనాలు ఉన్నాయి.   సలేశ్వర ఆలయానికి దగ్గరలో అటవీ ప్రాంతంలో అధ్బుత మైన మల్లెల తీర్దం అనే చారిత్రక జలపాతం ఉంటుంది.

భక్తుల సౌకార్యార్థం కోసం కొందరు స్వచ్ఛంద సంస్థల వారు ఉచితంగా భోజనం, ఇతర సేవా కార్యక్రమాలు చేపడుతారని వారికి ఐటీడీఏ, అటవీశాఖ, ఇతర శాఖల అధికారుల సహకారం అందిస్తారు. జాతరకు వచ్చే భక్తులు విలువైన ఆభరణాలు ధరించరాదని సూచించారు. ఆర్టీసీ బస్సులు కూడా రాంపూర్‌పెంట వరకే వెళ్తాయని అక్కడ నుంచి 2 km ఆటొ ప్రయాణం తరువాత కాలినడుకన భక్తులు సలేశ్వరం చేరుకోవాలి.లింగమయ్యను దర్శించుకోవడానికి, వాహనాలను లోపలికి అనుమతి కోసం వసూలు చేసే టోల్‌గేట్ ద్వారా వచ్చె డబ్బులను సలేశ్వరం చుట్టున్న 12 పెంటల అభివృద్ధికి ఖర్చు చేస్తారు.

This slideshow requires JavaScript.

నల్లమల అడవిలో మొత్తం పంచ లింగాలున్నాయి అంటారు:
శ్రీశైల మల్లికార్జునస్వామి (జ్యోతిర్లింగం), సలేశ్వరంలింగమయ్యస్వామి, లొద్దిమల్లన్న, ఉమామహేశ్వరం ఈ నాలుగు లింగాలే అందరికీ తెలిసినవి. తెలియని ఐదో లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటారు. ఆ ఐదో లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే!

This slideshow requires JavaScript.

లింగాల లో జరిగే కోదండరాముడి బ్రహ్మోత్సవాల సమయంలోనే ఈ క్షేత్రాన్ని భక్తుల దర్శించుకోవడం ఆనవాయితీ. ప్రత్యేక బస్సులు భక్తుల సౌకర్యార్థం నాగర్ కర్నూల్, అచ్చంపేట నుండి ఆర్.టి.సి బస్సులు నడుపుతున్నారు. లింగాల మండలం అప్పాయిపల్లి లో ఆర్టీసీ క్యాంపులు ఏర్పాటు , లింగాల నుండి కాలినడకన సలేశ్వరం వెళ్ళే భక్తులకు పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్ నుండి లింగాల, అప్పాయిపల్లి వరకూ ప్రతి 20 నిమిషాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు 

This slideshow requires JavaScript.

సలేశ్వరం చేరుకోవడానికి మార్గాలు:

1. హైదరాబాద్ వైపు నుండి సలేశ్వరం వచ్చే భక్తులు నేరుగా శ్రీశైలం బస్సు ఎక్కి ఫర్హాబాద్ చౌరస్తా దగ్గర దిగితే సరిపోతుంది. అక్కడ నుండి బస్సులు. ఆటోల రాంపూర్ చెంచు పెంట వరకు ప్రయాణించవచ్చు.
తెలంగాణ వైపు నుండి వచ్చే భక్తులకు అచ్చంపేట ,నాగర్ కర్నూలు బస్ డిపోల నుండి సలేశ్వరం కు నేరుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

2. శ్రీశైలం వైపు నుంచి వచ్చే భక్తులు హైదరాబాద్ బస్సు ఎక్కి ఫర్హాబాద్ చౌరస్తా దగ్గర దిగి సలేశ్వరం చేరుకోవచ్చు.

3. మరో మార్గం లింగాల మండలం అప్పాయిపల్లి మీద గా ఉంది. ట్రాక్టర్ల ద్వారా గిరిజ గుండాల వరకు అతి కష్టంమీద చేరుకొని అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణం చేస్తే సలేశ్వరం చేరుకోవచ్చు.

Saleswaram ,Telangana Amarnath,Nallamala forest – YouTube

 

SALESWARAM FOOTWAY, NALLAMALA,T.S – YouTube

vedadri nallagorla Historical view – YouTube

YELESWARAM GATTU SIVA TEMPLE/ఏలేశ్వరం గట్టు శివాలయం,ISLAND TEMPLE,NALGONDA DISTRICT,TELANGANA,INDIA

నల్గొండ జిల్లా చందంపేట మండలం లోని శ్రీ కాత్యాయిని సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలంటే సాహసయాత్ర చేయవలసిందే! నాగార్జునసాగర్ జలాశయంలో ఐలాండ్ బౌద్ధ మ్యూజియం గురించి అందరికీ తెలిసినప్పటికి అదే జలాశయము నడిమధ్యలో ఎత్తైన కొండపై కొలువై ఉన్న చారిత్రక ఐలాండ్ టెంపుల్ గురించి కొందరికి మాత్రమే తెలుసు.

DSC07141

అదే ఏలేశ్వరం గట్టు శివాలయం పర్యాటకపరంగా, చారిత్రాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న ఏలేశ్వరం గత 50 సంవత్సరాలుగా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణంతో, మునిగిన గ్రామాల్లో ఒకటి. 1962 నుండి ఏలేశ్వరం బాహ్య ప్రపంచంతో పాక్షికంగా సంబంధాలు తెగిపోయాయి అప్పుడప్పుడు నాటు పడవల్లో కొంతమంది భక్తులు వెళ్లి దర్శించుకున్నా పూర్తిగా మాత్రం 2006 సంవత్సరం నుండి భక్తులకు అందుబాటులోకి వచ్చింది.

శ్రీశైల ఈశాన్య ద్వారం గా ప్రసిద్ధి చెందిన ఏలేశ్వరం ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. బృహత్ శిలా యుగం నాటి ఆదిమ మానవుల ఆధారాలతో పాటు కాకతీయుల కాలం వరకు ప్రతి రాజవంశానికి సంబంధించిన శాసనాధారాలు ఇక్కడ లభ్యమైనాయి. శాతవాహనుల కాలంలో శ్రీ పర్వత విశ్వవిద్యాలయంగా, ఇక్ష్వాకుల కాలంలో వారి రాజధాని విజయపురి గా ఈ ప్రాంతం వెలుగొందింది.

ఏలేశ్వరం మల్లన్నను దర్శించుకోవాలంటే రెండు మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్ టూరిజం వారు సాగర్ దగ్గర ఉన్న అనుపు అనే ప్రాంతం నుండి మరియు తెలంగాణ టూరిజం వారు నల్గొండ జిల్లా హిల్కాలనీ(Hill colony) నుండి లాంచీలను శివరాత్రి మరియు తొలిఏకాదశ పర్వదినాలలో ఏర్పాటు చేస్తారు. అనుపు నుండి నదిలో ఏడు కిలోమీటర్లు దూరం ప్రయాణం చాల ఆహ్లాదకరంగా ఉంటుంది.

Y1

 

 

1000 అడుగుల ఎత్తున్న ఏలేశ్వరం గుట్టపైకి చేరాలంటే పల్నాటి రాజుల కాలంలో నిర్మించిన పదహారు వందల రాతి మెట్ల మార్గం ఉంది. ఈ మార్గం శిథిలమై చాలా కఠినంగా ఉండటంతో 2017 సంవత్సరంలో కొంత దూరం నడక దారి ఏర్పాటుచేశారు. లాంచీ నుండి దిగి కొండపైకి చేరుకునే మార్గంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కమిటీగా ఏర్పడి భక్తులకు అన్నదానం చేస్తారు.

నేను 2018 సంవత్సరం శివరాత్రికి ఏలేశ్వరం మల్లన్న ను దర్శించుకున్నాను ముఖ్యంగా చెప్ప వలసిన విషయం ఏమిటంటే “మానవ సేవ సమితి‌” స్వచ్ఛంద సంస్థ వారు మంచినీటి ప్యాకెట్లు, మజ్జిగ సరఫరా చేసి భక్తుల దాహార్తిని తీరుస్తున్నారు. కొండపైకి చేరుకున్న తర్వాత కృష్ణా నది అందాలు వర్ణించటానికి మాటలు చాలవు.
అనుపు నుండి లాంచి టిక్కెట్ ఖరీదు:
పెద్దలకు 150 రూపాయలు
పిల్లలకు 100 రూపాయలు

 

The Katyayani Sametha Mallilkarjuna Swamy Temple located at Yeleswaram amid the Krishna in the backwaters of the Nagarjunasagar reservoir has a unique feature. It is believed that the devotees who do not have children are blessed with offspring, if they offer prayers to the deity. The shrine is known by various names including ‘Baddu Mallayya’, ‘Santhana Mallikarjuna Swamy’, ‘Mallayya Gattu’ and ‘Nandikonda’.

Y3

The Yeleswaram hill at a height of 1,000 metres can be reached from the Vizag Colony (Nalgonda district,Telangana) two hours covering 20 kilometres. From Nagarjunasagar, the distance is reduced to 16 km consuming one-and-a-half hours and from Anupu  (Guntur district of Andhra Pradesh) it is only 7 km away.

With the devotees raising ‘Sambho Siva Sankara’ chants, visitors do not feel the strain of going up the hill, where two temples, one of Sakshi Ganapati and another of Parvathi-Siva, are located in a small area.The temple is only one to survive the submersion after the Nagarjunasagar reservoir was built. As it is located atop a hill it is not being patronised.

This slideshow requires JavaScript.

The forest department has arranged boats On Sivaratri and Toliekadasi days for devotees to reach the island. While during other days, nobody is allowed to visit the temple. Two Boat points avilable on these days,one from ANUPU(APTDC) and another from HILL COLONY(TSTDC).

Yeleswaram gattu(ఏలేశ్వరం)Siva temple, – YouTube  

MONDI BHAIRAVAKONA,NALLAMALA FOREST/మొండిభైరవకోన/భైరవకొండేశ్వర స్వామి,KADAPA DISTRICT,ANDHRAPRADESH

MONDI BHAIRAVAKONA,NALLAMALA FOREST/మొండిభైరవకోన/భైరవకొండేశ్వర స్వామి,KADAPA DISTRICT,ANDHRAPRADESH

‘Mondi Bhairva Kona’  Situated in the middle of Nallamala Reserve Forest at a distance of 12 miles from Onipenta and 30 miles Yerraguntla Railway Station. Onipenta is on the Mydukur – Porumamilla bus route. Journey for an hour through the deep forest will gives thrilling experience to pilgrims/tourists.

m1

One has to go through private transport (preferably a cab such as Tata Sumo, Toyota Qualis, Mahindra Bolero etc…) to reach Bhairava kona.

The image of Bhairava Kondaiah in the form of mondi sila (headless trunk in stone) is the place of worship in Bhairavakona.

m2

 

There is a legend attached to bhairava kondaih. In the gone by, cow-herds and shepherds of the surrounding villages were tending their cattle in Bhairvaswamy Kona. In course of time, herds increased to thousands and the water in the spring there fell short. Thousands of cows began to yell for water. Seeing their sufferings, Yadava Kondaiah, one of the cow –herds, bathed in the spring and prayed to god that he would sacrifice his head if the thirst of the cows was quenched.

m3

Immediately god responded to his request and water sprang up in abundance. The cows quenched their thirst. Kondaiah went to his village Lekkalavaripallie, hamlet of ganjikunta,and had come back with his relatives and friends to worship the lord and to sacrifice rams and goats to show their gratitude. Their joy knew no bounds when they saw the spring of water flowing out. After feast was over, they all started homewards.

m4

On their way Yadava Kondaiah returned to the spring with the pretext of getting something he had forgot ten. Hanging himself from a branch of the tree by tying his hair to it, he cut his head with a sword and the trunk fell down. After some time as Kondaiah did not turn up, the relatives came in search of him and saw the horrible scene to their great sorrow, consoling themselves that it was his entire act.

m5

They buried his body and head near the spring and installed a mondi sila (headless trunk in stone) of Kondaiah. One of the bulls of Lekkala Subbi Reddy of Lekkalavaripalle died before the deity on the day of the festival and it was buried in front of the deity and an image of Nandi was installed over its tomb. It is worshipped during the festival days. The deity is surrounded upto a radius of 5 miles by a thick forest known as Bhairavaswamy Chenu.

m6

But it is free from any danger from wild animals and poisonous reptiles. Women during their monthly periods should not enter that sacred place lest they should be driven off by a kind of bees. One strange phenomenon of this place is that green gram should not be offered to the deity in any form and it is feared that those that offered had unfavorable experiences.

m9

Sri Mondi Bhairava Kondaiah or Bhairava swamy festival is celebrated for three days from Magha Bahula Triodasi to Amavasya (February-March) during Mahasivaratri.

On the first day, jagarana (keeping awake throughout the night) is observed. The next day, tonsure ceremonies are performed and the issueless pray for children. On the third day, fowls, goats and rams are sacrificed in addition to offering of bonamulu.

m11

Devotees take bath in the spring, observe fast on the first day and offer naivedyams (Consecration of food to a god) on the second day and consume choice sweetmeats.

The ryots, when the crops are infested, take bath in the spring, bring the sand from there and scatter it mixing the same with poli (blood of goat etc.) in their fields without placing it on earth and without sleeping on the way. This festival is being celebrated for the past 50 years and is widely known.

The village Munsiff of Ganjikunta is the chief patron. Nearly 20,000 people of all communities from various parts of the state congregate. Pujari is Lekkala Balireddy . Prasadam is distributed to all.

m12

Free feeding is arranged in addition to poor feeding. The water spring affords plenty of water to the pilgrims.

How to Reach Bhairava Kona:

By Road:

Kadapa —> Mydukur –> Onipenta –> Mudireddipalli Sugali Tanda —> Nallama Forest –> Bhairavakona

Nearest Railway Station: Kadapa (60 KM), Yerraguntla (50 KM)

Nearest Bus Station: Mydukur (30 KM)

Name of the Person: Mr. BaliReddy

Mobile : +91-9676319205

మొండిభైరవకోన/భైరవకొండేశ్వర స్వామి

దట్టమైన నల్లమల అడవిలో ఉన్న శివాలయాలలో మొండి భైరవకోన/భైరవ కొండేశ్వరస్వామి ఆలయం ప్రశిద్ధి చెందింది. ఇది కడప జిల్లాలోని ఒనిపెంట గ్రామం నుండి 20km దూరం మరియు యర్రగుంట్ల Rly station నుండి 48 km దూరంలో ఉంది.మైదకూరు—పోరుమామిళ్ళ బస్సుమార్గంలో ఒనిపెంట గ్రామం ఉంటుంది.ఇక్కడనుండి దట్టమైన అటవిమార్గంలో 1గంట ప్రయాణిస్తే మనం మొండిభైరవకోనకు చేరుకోవచ్చు.

కేవలం ప్రవేటు వాహనాలలో మాత్రమే చేరుకునే అవకాశమున్న ఇక్కడికి TATA SUMO,MAHINDRA BOLERO,JEEPS మరియు భైకులమీద మాత్రమే వెళ్ళటానికి వీలుంటుంది.మైదకూరు నుండి జీపులు అందుబాటులో ఉంటాయి.

m7

ఈ ప్రాంతంతో భైరవ కొండయ్య అనే వ్యక్తికి సంబందం ఉంది.పూర్వం చుట్టుప్రక్కల గ్రామాల పశువుల/గొర్రెల కాపరులు ఈ ప్రాంతానికి మందలను గ్రాసం కోసం తోలుకొచ్చేవారు.ఇక్కడ గడ్డి ఎక్కువగా ఉన్నప్పటికి పశువులకు నీటికోరత ఉండేది.చిన్న సెలయేరు మాత్రమే ఆదారం,యాదవ కొండయ్య అనే పశువుల కాపరి ఆ నీటిలో స్నానంచేసి పశువులకు చాలినన్నీ నీరు ఇస్తే తన తలను శివునికి అర్పిస్తానని మ్రొక్కుకున్నాడు.

m10

శివుడు కొండయ్య కోరికను తీర్చడంతో అక్కడ ఒక సహజ బుగ్గ(Spring) ఏర్పడి నిరంతరం నీటి ప్రవాహం కల్గింది,దాంతో కొండయ్య తన గ్రామం లెక్కలవారిపల్లి వెళ్ళి గ్రామస్థులు,బందువులతో కలిశి వచ్చి శివుని ఆరాధించి మేకలు,కోళ్ళలను బలి ఇచ్చి ఉత్సవం చేసారు.తిరుగు ప్రయాణంలో ముందు అనుకున్న ప్రకారం కొండయ్య వెనక్కి తిరిగివచ్చి శివునిముందు తన తలను నరుక్కోని ప్రణాలర్పించాడు.వెతుకుతూ వెనక్కి వెళ్ళిన గ్రామస్థులు ఈ భయానక ధృశ్యం చూసి అతనిని అక్కడే పూడ్చి దాని మీద తలలేని ఒక మొండి శిలను ప్రతిష్టించారు.

m8

తర్వాత కాలంలో లెక్కల సుబ్బిరెడ్దికి చెందిన ఎద్దు దానిని కూడ అక్కడే సమాధి చేసి దానిముందు ఒక నంది శిలనుంచారు.పండుగ రోజుల్లో వీటిని పూజించడం సంప్రదాయంగా వస్తుంది.ఈ చుట్టుప్రక్కల ఉన్న 8 km మేర అడవిని భైరవస్వామి చేను అనడం ఆనావాయితి.
దట్టమైన అరణ్యమైనప్పటికి క్కడ ఎటువంటి క్రూరమృగాలు కన్పించవు,కొన్ని రకాల పక్షులు,నెమళ్ళు కన్పిస్తాయి.

ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నుండి అమావాస్య(శివరాత్రి)(feb-march) వరకు 3రోజులు ఉత్సవాలు చేస్తారు,అన్ని వర్గాలకు చెందిన సుమారు 20000 మంది భక్తులు పాల్గొంటారు.ఈరోజుల్లో అన్నదానం కూడ జరుగుతుంది. విడి రోజుల్లో ఆదివారం కొంతమంది భక్తులు వస్తూంటారు.

m13

ప్రస్తుతం లెక్కల బాలిరెడ్డి గారు ఇక్కడ పూజారి విధులు నిర్వర్తిస్తున్నారు,అతని cell no:9676319205.

మొండిభైరవకోనకు దారి:

1.కడప-మైదకూరు-ఒనిపెంట-ముదిరెడ్దిపల్లి సుగాలితండా-నల్లమల అటవిమార్గం-భైరవకోన.=58km
2.గిద్దలూరు-కొమరోలు-పోరుమామిళ్ళ-మల్లెపల్లి-ముదిరెడ్దిపల్లి-సుగాలితండా-నల్లమల అటవిమార్గం-మొండిభైరవకోన=102km

NITYAPOOJAKONA,SIDDAVATAM MANDAL,KADAPA DISTRICT,ANDHRAPRADESH

BHEEMUNIKOLANU,NALLAMALA FOREST,SRISAILAM,A.P

This is one of the most important and historical spot through which the ancient foot path of Srisailam from the southern and western sides pass.Located between two steep hills, the rock ledge endowed with spectacular water falls. This pathway with excellently laid steps of solid stone slabs can be seen even today which are beginning from Nagalooty, a temple complex, in the dense forest.On Ugadi and sivaratri days thousands of devotees visit srisailam on pathway from Nagalooty -Pedda cheruvu-sitamma bhavi-Bheemunikolanu-Kailasa Dwaram-srisailam route(Nearly 50kms),If we want visit this place from srisailam pathway starts from beside Hatakeswaram forest gate,from there we walk 5kms on road we reached kailasadwaram from there walk down 850 steps you reached Bheemunikolanu.

IMG-20171205-WA0005-01

According to that story the Pandavas during their pilgrimage while in Vanavasam came to this place. At that time Draupadi was feeling with thirst and they could not find water any where in the vicinity. Due to this Bheema got angry and hit the hill with his mace. As a result the hill was split into two parts and water came up from its middle and later the stream named as Bheemuni Kolanu.

IMG_20171203_125733045

Pleased by this flow of water, Bheema is said to have consecrated a Sivalinga at the place which was referred in Skanda Purana as Bheema Linga and the spring as Bheema Gundam. At present there are two dilapidated temples which are locally known as Bheemeswara and Bheemunikolanu temples and both are datable to 8th-10th centuries A.D.

DSC06888

At the top of his ascending 850 steps from Bheemuni Kolanu, there is another place called Kailasa Dwaram.where remains of once magnificent gate way can be seen even today. The pilgrims after excruciating sojourn through step hills and valley, when finally reaches the planty surface, they get the feeling of Kailasa i.e., Srisailam and hence named as Kailasadwaram. It is 5 Kms road and there on steps.

DSC06920-01

భీముని కొలను

ఇది ఒక భూలోక కైలాసం ,
శ్రీశైలంలోని హఠకేశ్వరము నుండి 8 కి.మీ ప్రయానముతో భీముని కొలను చేరుకోవచ్చు, ప్రయాణము మొత్తము కాలినడక మార్గము ద్వారానే ఉంటుంది,ప్రయాణ మార్గము మొదట ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి గేట్ ఉంటుంది, అది దాటుకుని 3 కి.మీ పల్లపు మట్టి మార్గము గుండా నడిస్తే అక్కడ భీముని కొలను చేరుకొను ఒక ఆర్చి వస్తుంది అక్కడినుండి మొత్తము 5 కి. మి ల లోతు గల పెద్ద లోయ కనిపిస్తుంది ,

850 సంవత్సరాల క్రితమే లోయ లో చాలావరకు భక్తుల సౌకర్యార్థం 2500 మెట్లను పెద్ద పెద్ద బండరాళ్లతో అప్పటి రాజులు నిర్మించడం జరిగినది అవి ఇప్పడికి చెక్కుచెదరని రూపంతో భక్తులకు ఉపయోగకరంగా ఉన్నాయి,మెట్ల మార్గం కూడా దాటుకుని వెళితే , ప్రమాదకర కొండ అంచులగుండా మిగిలిన ప్రయాణం చేసి లోయ దిగి భీముని కొలను చేరుకోవలసి ఉంటుంది,

DSC06909

మన రాష్ట్రం లోని అందమైన ఈ ప్రదేశం గురించి మన తెలుగు ప్రజలకు చాలా మందికి తెలియదుకానీ కర్ణాటక , మహారాష్ట్ర నుండి లక్షలలో భక్తులు శివరాత్రి, ఉగాది పర్వదినాలలో తరలివస్తారు,శ్రీశైలము కు కాలి మార్గము ద్వారా భక్తులు వస్తారని మనకు తెలుసు , ఆత్మకూరు నుండి భైరుటి మీదగా నడుచుకుంటూ ఈ భీముని కొలను గుండా హఠకేశ్వరం చేరుకొని శ్రీశైలం వస్తారు మొత్తం 70 కి. మీ నడక మార్గం లక్షల మంది శివభక్తులతో నిండి పోతుంది

ఇది పులుల రక్షిత ప్రాంతము కావడంతో ఇప్పుడు భక్తులను కేవలం శివరాత్రి, ఉగాది రోజులలోనే అనుమతిస్తున్నారు, మిగిలిన రోజులలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి అనుమతితో వెళ్ళవచ్చుభీముని కొలను ప్రాంతం లో మన్ననే 15 రోజుల క్రితం ఒక చిరుత పులిని దుండగులు చంపిన కారణంగా మాకు పర్మిషన్ రావడం కష్టమైనది , ఇప్పుడు ఆ ప్రాంతం రెడ్ అలెర్ట్ గా ప్రకటించడం జరిగినది.

DSC06886

మొత్తం 40 మందితో జరిగిన మా ప్రయాణం ఆహ్లాదకరంగా ఉల్లాస భరితంగా సాగింది.ఈ ప్రాంతం చిరుత, ఎలుగ బంటులకు ఆవాసం, ఇక్కడ అవి ఎక్కువగా సంచరిస్తున్నట్లు గుర్తించారు, కనుక ఈ ప్రాంతాన్ని సందర్శించాలి అనుకున్నవారు ఎక్కువ మందిగా ఒక గుంపుగా వెళ్ళాలి.

Bheemunikolanu,Srisailam – YouTube

NEMALIGUNDLA RANGANAYAKA SWAMY TEMPLE IN NALLAMALA FOREST,NEAR GIDDALURU,PRAKASAM DISTRICT,ANDHRAPRADESH

Sri Nemaligundla Ranganayaka Swamy Temple is a famous temple located in the middle of the thick Nallamala forest and is known for its waterfalls called ‘Rangaswamy Gundam’.

DSC06446

 

This beautiful tourist spot is present at a distance of about 20 km away from Giddaluru.Temple is in Pullalacheruvu village under Racherla Mandal  in Prakasam District of Andhra Pradesh state.

r6

Sri Ranganayaka Swamy is the brother of Lord Venkateswara Swamy ,Nemaligundam (Peacock Pool) Sri Ranganayaka Swamy Kshetram is around 20 km from Giddalur town/40 km from Bestavaripet.
DSC06457
The temple is located in the middle of Nallamala hills on the banks of Gundlakamma rivulet which flows from the top of a hillock surrounded by steep mountains.

DSC06447

Gundlakamma is a seasonal river that originates in Gundlabrahmmeswaram hill of Nallamala ,here also a famous temple Gundlabrahmmeswara swamy ,this temple opens and allow devotees From Diguvamitta forest checkpost only once in a year on MAHA SIVARATRI.the river enters in the plains near Cumbum.

 

r3
Best Time to visit Rangaswamy Gundam is during Saturdays, Sundays and in the monsoon season.The temple open on every saturday and festival days.RTC bus available from Giddaluru bus stand on Saturdays,otherwise hire autos/cars from Giddaluru/Bestavaripet.

Nemaligundam waterfall – YouTube

Nemaligundam Ranganayaka swami temple, Prakasam – YouTube

Nemaligundam waterfall,prakasam district – YouTube

PALANKA VEERABADRA TEMPLE,NALLAMALA FOREST,PRAKASAM Dt,A.P

PEDAVEGI,A HISTARICAL AND BUDDHIST SITE,NEAR ELURU,WEST GODAVARI DISTRICT,ANDHRA PRADESH

Pedavegi is a village in West Godavari district in the state of Andhra Pradesh in India, 10 km north of Eluru. It is administered under Eluru revenue division. Pedavegi also serves as the mandal headquarters of Pedavegi mandal.It was formerly known as Vengipuram.

d4

Eastern Chalukyas, or Chalukyas of Vengi were a South Indian dynasty whose kingdom was located in the present day Andhra Pradesh. Their capital was Vengi and their dynasty lasted for around 500 years from the 7th century until c. 1130 C.E. when the Vengi kingdom merged with the Chola empire.

d3

 The Vengi kingdom was continued to be ruled by Eastern Chalukyan kings under the protection of the Chola empire until 1189 C.E., when the kingdom succumbed to the Hoysalas and the Yadavas.

d2

They had their capital originally at Vengi now (Pedavegi) of the West Godavari district end later changed to Rajamahendravaram (Rajamundry).

d1

Vengipura is a renowned capital of the early dynasties like Salankayana, Vishnukundin and Eastern Chalukyas that ruled Andhra Desa from the middle of 4th century AD to 11th century AD. The excavation conducted at Dhanamdibba site, literally ‘mound of wealth’ revealed two phases of cultural activity, both assignable to the early historical period.

d5

In pedavegi village beside of tank there is a old temple constructed with red stone.opposite this temple A siva temple is there.in this temple premises lot of old statues are present.

Pedavegi buddha stupa’s,near Eluru,WG district – YouTube